లోక్‌సభకు పోటీ చేస్తా | Compete in the next parliamentary elections | Sakshi
Sakshi News home page

లోక్‌సభకు పోటీ చేస్తా

Jan 31 2019 5:16 AM | Updated on Jan 31 2019 5:16 AM

Compete in the next parliamentary elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తానని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ వెల్లడించారు. అయితే, ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఎక్కడి నుంచి పోటీచేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ దొడ్డిదారిన గెలిచారని విమర్శించారు.

వీవీప్యాట్‌లను లెక్కించాలని తాము కోరుతున్నామని, కాలం గడిచేకొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము వేసిన పిటిషన్‌పై వీవీ ప్యాట్‌ల వివరాలు ఐదేళ్లు ఉంటాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారని, దీనిపై వచ్చేనెల 7లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు ఓట్ల కూల్చివేత కూడా జరిగిందని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్‌ పో 

Advertisement
 
Advertisement
Advertisement