కృత్రిమ మేథో సంవత్సరంగా 2020

KTR Meet With Nasscom President Devayani Ghosh - Sakshi

నాస్కామ్‌ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో కేటీఆర్‌ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ‘కృత్రిమ మేథస్సు సంవత్సరం’గా 2020ను ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య రక్షణ రంగాల్లో కృత్రిమ మేథస్సు వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నాస్కామ్‌ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌ తో ప్రగతిభవన్‌లో శుక్రవారం కేటీఆర్‌ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పొడవునా కృత్రిమ మేథస్సు అంశంపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నూతన సాంకేతికతలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను దేవయానికి కేటీఆర్‌ వివరించారు.  డేటా సైన్సెస్‌లో యువతకు శిక్షణ ఇవ్వడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై దేవయాని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరక్టర్‌ రమాదేవి, డిజిటల్‌ మీడియా డైరక్టర్‌ కొణతం దిలీప్‌ సమావేశంలో పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top