రోడ్డు ప్రమాదంలో పరిగి ఎమ్మెల్యేకు గాయాలు  | Koppula Mahesh Reddy Vehicle Met An Accident At Chevella | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పరిగి ఎమ్మెల్యేకు గాయాలు 

Sep 20 2019 10:35 PM | Updated on Sep 21 2019 10:19 AM

Koppula Mahesh Reddy Vehicle Met An Accident At Chevella - Sakshi

చేవెళ్ల : వికారాబాద్‌ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం షాబాద్‌ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మహేశ్‌రెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌రెడ్డి తన ఇన్నోవా కారులో డ్రైవర్‌ శ్రీకాంత్, గన్‌మెన్‌ పాషాతో కలిసి పరిగి నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. చేవెళ్లకు చెందిన టేకులపల్లి మల్లేశ్‌ కారులో చేవెళ్లనుంచి తన దాబాకు వెళ్తున్నాడు. 2 కార్లు హైదరాబాద్‌ వెళ్తుండగా ముందు వెళ్తున్న మల్లేశ్‌ కారును ఎమ్మెల్యే వాహ నం వెనకనుంచి ఢీకొట్టంతో 2 కార్లు పల్టీ కొట్టాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement