చంచల్‌గూడ జైలుకు కోదండరామ్ | kodandaram in chanchalguda jail | Sakshi
Sakshi News home page

చంచల్‌గూడ జైలుకు కోదండరామ్

Dec 21 2017 11:46 AM | Updated on Oct 8 2018 3:00 PM

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్ళారు. జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కోదండరామ్ కలిశారు. ట్యాంకుబండ్ వద్ద ధర్నాకు ఉపక్రమించారన్న కారణంతో మంద కృష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను కోదండరామ్ పరామర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement