‘కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ | 'KCR topromise retain the ' | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’

Mar 14 2016 2:18 AM | Updated on Nov 9 2018 5:56 PM

‘కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ - Sakshi

‘కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’

జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని ...

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించారుు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిస విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడారు. మాట తప్పిన కేసీఆర్ జిల్లాకు వచ్చేందుకు జంకుతున్నారన్నారు.

ఉట్నూర్‌లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి యూనివర్సిటీ ఏర్పాటు చేయూలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. పీడీఎస్‌యూ వెంకటేశ్, ఏఐఎస్‌బీజే రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement