ఆడబిడ్డకు మేనమామ కేసీఆర్‌ | kcr is a people leader says gongidi sunitha mahender reddy | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డకు మేనమామ కేసీఆర్‌

Feb 9 2018 6:03 PM | Updated on Oct 30 2018 8:01 PM

kcr is a people leader says gongidi sunitha mahender reddy - Sakshi

చెక్కులను పంపిణీ చేస్తున్న విప్‌ సునీత

యాదగిరిగుట్ట(ఆలేరు) : ఆడబిడ్డల పెళ్లీలకు ఈ రోజులలో సొంత మేనమామ కూడా ఆదుకోలేని పరిస్థితిల్లో, తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.75,116లు ఇచ్చి ఆడపిల్లల మన్ననలను సీఎం కేసీఆర్‌ పొందుతూ, వారికి మేనమామగా ఉంటున్నాడని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలో కల్యాణలక్ష్మి పథకంలో అర్హులైన 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె అందజేశారు.

ఇందులో రూ.75,116 చెక్కులు 57 మందికి, రూ.51వేయ్యి 6 మందికి అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద వారి వివాహాలకు రూ.75,116లు అందించి ఆదుకుంటున్నారన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేసుకుంటే కేసీఆర్‌ కిట్టు కింద ప్రతీ మహిళకు రూ.15వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. అంతే కాకుండా బాలింతలకు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం పేరుతో పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యానికి సీఎం రక్షణగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, డిప్యూటీ తహసీల్దార్‌ సలీమొద్దిన్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కసావు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఉపాధ్యక్షుడు నువ్వుల రమేష్, యువజన విభాగం కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్, నాయకులు కవిడే మహేందర్, బీర్ల మహేష్, కాంటేకార్‌ పవన్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement