పాతబస్తీకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.
హైదరాబాద్: పాతబస్తీకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ....ఈద్‌బజార్‌లో నివసించే మోమినా బేగం (20) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. ఈ నెల 27వ తేదీన జూబ్ల్లీహిల్స్‌లో షూటింగ్ నిమిత్తం వెళ్ల్లి.. మరో ఇద్దరు స్నేహితురాళ్లతో ఆటోలో వస్తుండగా పంజగుట్ట వద్ద మోమినా బేగంకు ఫోన్ వచ్చింది.
వెంటనే ఆటోదిగి వారిని వెళ్ల్లి పొమ్మని చెప్పింది. అప్పటి నుంచి అదృశ్యమైంది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి ఫాతిమా బేగం గురువారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు 9490616615 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.