జాయింట్ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
జిల్లా సంయుక్త కలెక్టర్‌గా రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
	ప్రగతినగర్ : జిల్లా సంయుక్త కలెక్టర్‌గా రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ఎస్టేట్ సెక్రెటరీగా ఉన్న ఆయనను జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. తహశీల్‌దార్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన రవీందర్‌రెడ్డి డీఆర్‌ఓ, జడ్‌పీ సీఈఓ, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు.
	
	రెవెన్యూ, పౌరసరఫరాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర విషయాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కొత్త జేసీకి బాధ్యతలను అప్పగించారు. ఏడు నెలలుగా జేసీ బాధ్యతలను కలెక్టరే చూస్తున్నారు. బాధ్యతలు స్వీక రించిన అంతనరం జేసీకి పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
