ఓటరు జాబితా సిద్ధం చేయాలి

Jagtial Collector Held review Meeting On Voter List Regarding Panchayathi Elections - Sakshi

కలెక్టర్‌ శరత్‌

జగిత్యాల:  గ్రామపంచాయతీల్లో ఓటరు జాబి తాను తయారు చేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని జాబితాలో లేని వారి పేర్లను సిద్ధం  చేసుకొని ఇంటింటికీ వెళ్లి సరిచూసుకోవాలని సూచించారు. నేషనల్‌ రివ్యూ కమిటీ వస్తుందని.. బీసీ ఓటరు లిస్ట్‌ను తయారుచేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ని ర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలన్నా రు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయి ంచాలని సూచించారు. గ్రామపంచాయతీ సెక్రటరీ, ఏపీడీ, ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు పరిశీలించి అర్హులకే అందజేయాలన్నారు. గ్రామపంచాయతీలకు ఎల్‌ఈడీ లైట్లు, తడి, పొడి చెత్త డబ్బాలు వస్తాయని, సరిపోకపోతే మళ్లీ పంపిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ, అటవీ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు.  

లక్ష్యాన్ని పూర్తి చేయాలి 
గొర్రెలు, పాడిపశువుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. తన కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీపై సమీక్షించారు. పాడి పశువులు 15,412కు ఇప్పటి వరకు 1333 పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్, విజయ డెయిరీల లబ్ధిదారుల వాటాను డీడీల రూపంలో త్వరగా చెల్లించాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ లక్ష్యం 10,510 యూనిట్లు కాగా ఇప్పటి వరకు 4629 యూనిట్లు సరఫరా చేసినట్లు తెలిపారు. చనిపోయిన గొర్రెలకు సంబ ంధించి 3,209 గొర్రెలకు ఇన్సూరెన్స్‌ మంజూరుకాగా 1,745 గొర్రెల లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా పశువైద్యాధికారి అశోక్‌రాజు, సహాయ సంచాలకులు శ్రీధర్‌ పాల్గొన్నారు. 

‘పది’లో ఉత్తీర్ణతశాతం పెరగాలి 
జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. విద్యాశాఖ అధికారుల సమీక్షలో భాగంగా మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులలో విద్యావలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ప్రతీ సబ్జెక్ట్‌లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌ ఇచ్చేందుకు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.100 తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు గ్రామస్థాయిలో ఓ గ్రూప్,  వాడస్థాయిలో మరో గ్రూప్‌ పెట్టాలని సూచించారు. సబ్జెక్ట్‌లవారీగా ఉపాధ్యాయులు నోట్స్‌ తయారుచేసి పిల్లలకు అందివ్వాలన్నారు. డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top