తెలంగాణలో క్రీడాకారులకు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.
నిజామాబాద్: తెలంగాణలో క్రీడాకారులకు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుం దని, క్రీడాకారులు ధైర్యంతో ఆడాలని సూచించారు. బుధవా రం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో రాష్ట్రస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మన రాష్ట్రం మనకు ఏర్పడిన తర్వాత క్రీడాకారులు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారిణులకు సీఎం కేసీఆర్ రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారన్నారు.