
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ రేంజ్ డీఐజీగా ప్రమోద్ కుమార్‌ను నియమించగా.. ప్రస్తుత డీఐజీ రవి వర్మను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆదిలాబాద్ ఎస్పీగా విష్ణు ఎస్ వారియర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న నివాసులును డీజీపి కార్యాలయానికి బదిలీ చేశారు. కొమురంభీం జిల్లా ఎస్పీగా మలేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.