20 ఏళ్ల ఐఎస్‌ఎస్‌!

International Space Station has been in orbit for 20 years - Sakshi

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కి 20 ఏళ్లు నిండాయి.
1998 నవంబర్‌ 20న రష్యా రాకెట్‌ ద్వారా నింగికెగసిన ఐఎస్‌ఎస్‌ దశలదశలుగా విస్తరించి ఇప్పుడు ఓ ఫుట్‌బాల్‌ మైదానమంత సైజుకు చేరుకుంది. అంతరిక్షంపై కూడా పట్టు సాధించాలన్న సంకల్పంతో రష్యా ఐఎస్‌ఎస్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టినా.. అమెరికా, యూరప్, కెనడా, జపాన్‌ చేరికతో అసలు సిసలైన అంతర్జాతీయ పరిశోధన కేంద్రంగా అవతరించింది. అంతరిక్ష పరిస్థితులను అర్థం చేసుకునేందుకు.. భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి తొలి మజిలీగా ఉపయోగపడుతుందన్న అంచనాతో సిద్ధమైన ఐఎస్‌ఎస్‌ విశేషాలు మరిన్ని..

230 +2000 నవంబర్‌ నుంచి ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన వ్యోమగాముల సంఖ్య!!
భారతీయ అమెరికన్‌ వ్యోమగామి కల్పనా చావ్లా 2003 ఫిబ్రవరి 1న ఐఎస్‌ఎస్‌ నుంచి తిరిగి వస్తూండగా జరిగిన ప్రమాదంలో మరణించగా.. సునీతా విలియమ్స్‌ విజయవంతంగా తిరిగివచ్చారు.

ఉన్న బెడ్‌రూమ్‌లు 6
భూమి నుంచి ఐఎస్‌ఎస్‌కు చేరేందుకు పట్టే సమయం కూడా 6 గంటలే అనుసంధానం కాగల రాకెట్ల సంఖ్య కూడా ఆరే!

2028
ఐఎస్‌ఎస్‌ జీవితకాలం ముగిసే సంవత్సరం నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం. ఇందులో నాసా భాగం పది వేల కోట్ల డాలర్లు!

15000
బిల్‌షెపర్డ్‌ (అమెరికా), సెర్గీక్రికలేవ్, యూరీ గిడ్జెంకో (రష్యా) ఐఎస్‌ఎస్‌పై అడుగుపెట్టిన తొలి వ్యోమగాములు

4–6 నెలలు...
వ్యోమగాములు ఇక్కడ గడిపిన సమయం 90 నిమిషాలు.. భూమిని చుట్టేసేందుకు ఐఎస్‌ఎస్‌కు పట్టే సమయం ఇది! ఇంకోలా చెప్పాలంటే ఇది గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతూంటూ ఉంటుందన్నమాట!  

రాత్రివేళ ఆకాశంలో కనిపించే మూడో అతి ప్రకాశవంతమైన ఆకారం ఇదే!

16...  అంతరిక్ష కేంద్రంలో భాగంగా ఉండే సోలార్‌ ప్యానెళ్ల సంఖ్య. వీటిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతోనే మొత్తం వ్యవహారాలు నడుస్తాయి.

1200
ఐఎస్‌ఎస్‌లో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రచురితమైన వ్యాసాలు!

ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాముల శరీరపు స్వేదం ఆవిరి కానే కాదు. దీంతో తరచూ టవళ్లను వాడాల్సి వస్తుంది.

1760
83 దేశాల శాస్త్రవేత్తలు రిమోట్‌ పద్ధతి ద్వారా నిర్వహించిన పరిశోధనలు.

చిన్న చిన్న మరమ్మతులకు అవసరమైన పరికరాలను అక్కడికక్కడే ప్రింట్‌ చేసుకునేందుకు ఐఎస్‌ఎస్‌లో ఒక త్రీడీ ప్రింటర్‌ కూడా ఉంది. ఈ ప్రింటర్‌తో ఇప్పటి వరకూ ఒక రెంచ్‌తోపాటు 13 డిజైన్లతో కూడిన 20 వస్తువులను ముద్రించారు.

2001 ఏప్రిల్‌ 30న ఐఎస్‌ఎస్‌పై అడుగుపెట్టి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారు.. డెన్నిస్‌ టిటో!

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top