వరిఉత్పత్తిలో భారతదేశానిది తొలి స్థానం | Indian's first place to producing of paddy crop | Sakshi
Sakshi News home page

వరిఉత్పత్తిలో భారతదేశానిది తొలి స్థానం

Apr 12 2015 4:51 PM | Updated on Sep 3 2017 12:13 AM

వరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్, అంతర్జాతీయ వరి పరిశోధన డైరెక్టర్ జనరల్ రాబర్ట్‌లు అన్నారు.

హైదరాబాద్: వరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్, అంతర్జాతీయ వరి పరిశోధన డైరెక్టర్ జనరల్ రాబర్ట్‌లు అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని డిఆర్‌ఆర్‌లో జరిగిన రైస్ రిసర్చ్ గ్రూప్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిధిలుగా హజరైయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ఉత్పత్తికి భారతదేశం ప్రత్యేకం అన్నారు. ప్రస్తుతం పరిశోదనల ద్వారా మరిన్ని వరి వంగడాలు మార్కెట్‌లోకి వస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత పౌష్టిక విలువలు కల్గిన వరి వంగడాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement