పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ధర్నా | 'Increase Pocharam project dam height' | Sakshi
Sakshi News home page

పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ధర్నా

Oct 21 2017 7:03 PM | Updated on Oct 21 2017 7:03 PM

'Increase Pocharam project dam height'

ఎల్లారెడ్డి: పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం నాయకులు శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోచారం ప్రాజెక్టు ఎత్తును ఐదు అడుగులకు పెంచాలని అన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు త్రాగు నీరు, సాగు నీరు లభిస్తుందని అన్నారు. పోచారం ప్రాఎక్టు ఎత్తుపెంచే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అఖిల పక్షం నాయకులు అన్నారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు గయాజుద్దిన్, చిరంజీవులు, బాలకిషన్, ఇమ్రాన్, బాలరాజు, సాయిరాములు, ఏగుల నర్సింలు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement