
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసు’ కు సంబంధించిన నిందితుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు 23 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌కు ఐటీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 1లోగా బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్‌లో వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా హాజరకాకపోతే సెక్షన్ 271ఏ ఐటీ యాక్ట్ కింద జరిమాన విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. (రేవంత్ ఇంట్లో సోదాలు)
ఉదయ్ సింహ ఇంట్లో ముగిసిన సోదాలు: ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహ ఇంట్లో నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఉదయ్ సింహా ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులకు సంబంధించిన మూడు నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ పట్టుబడ్డ 50 లక్షలతో పాటు డీల్ భాగంగా ఇతరు నగదు ఎలా సమీకరించాలనుకున్నారని ఉదయ్ సింహను ప్రశ్నించారు. అంతేకాకుండా ఉదయ్‌కు చెందిన ఆస్తులు, ఆదాయం, రాబడుల వ్యవహారాలపై కూడా ఐటీ అధికారులు కూపీ లాగారు. సెక్షన్ 131 ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం ఉదయ్‌కు ఐటీ అధికారులు నోటీసుల ఇచ్చారు. అక్టోబర్ 1ను విచారణ సిద్దంగా ఉండాలని నోటీసులో పేర్నొన్నారు.
చదవండి: