నేడూ మోస్తరు వర్షాలు | IMD forecasts rain on wednesday | Sakshi
Sakshi News home page

నేడూ మోస్తరు వర్షాలు

May 3 2017 1:30 AM | Updated on Sep 5 2017 10:13 AM

ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాస్తవంగా పొడి వాతావరణం నెలకొంటుందని ముందుగా ప్రకటించినా గాలి వేగంలో వస్తున్న మార్పుల కారణంగా పరిస్థితి మారిందని పేర్కొంది. మరోవైపు మంగళవారం రాష్ట్రంలో అనేకచోట్ల సాధారణం కంటే కాస్తంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా హన్మకొండలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణంగా 41.1 డిగ్రీలు నమోదు కావాల్సివుందని, కానీ 2.6 డిగ్రీలు తక్కువగా నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement