ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
జీడిమెట్ల : ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ దత్తసాయి రెసిడెన్సిలోని 104 ప్లాట్‌లో పట్టపగలు చోరీ జరిగింది. ప్లాట్‌లో నిమాసముంటున్న పరమేశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలుపడి 19 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానకి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.