రూ.8 కోట్లతో ఉడాయించిన వ్యాపారి! | hotel owner in hyderabad escaped with rs 8crores | Sakshi
Sakshi News home page

రూ.8 కోట్లతో ఉడాయించిన వ్యాపారి!

Oct 19 2014 12:19 PM | Updated on Sep 4 2018 5:15 PM

ఈసీఐఎల్ చౌరస్తాలోని రెండు హోటళ్లు, మెస్‌లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి స్థానికులకు రూ.8 కోట్ల మేర టోకరా వేసి ఉడాయించాడు.

 హైదరాబాద్: ఈసీఐఎల్ చౌరస్తాలోని రెండు హోటళ్లు, మెస్‌లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి స్థానికులకు రూ.8 కోట్ల మేర టోకరా వేసి ఉడాయించాడు.  విశాఖపట్నం, యలమంచిలి మండలానికి చెందిన ఆర్.రాజారావు (62) బాల్యంలోనే నగరానికి వచ్చి శ్రీచక్రిపురం కాలనీలో ఉంటున్నాడు. హోటల్ వ్యాపారం చేసే రాజారావు, స్థానికంగా తెలిసిన వారి వద్ద అందిన కాడికి అప్పులు చేశాడు. ఈనెల 8వ తేదీ రాత్రి నుంచి రాజారావు కనిపించకుండా పోవడంతో అధిక వడ్డీలకు ఆశపడి అప్పులు ఇచ్చినవారు లబోదిబోమంటున్నారు. కాగా, రాజారావు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఐ.పీ పెట్టినట్లు సమాచారం.

 

అతడు దాదాపు ఎనిమిది కోట్ల మేర అప్పు చేసినట్లు తెలిసింది .కాగా, ఈ విషయమై కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకట రమణ మాట్లాడుతూ, నిందితుడు ముందుగానే ఐపీ పెట్టుకోవడంతో బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement