అప్పులు చేసి.. బిల్లులు కట్టి..

Hotel Bills And Flight Charges Burden on Migrant Labourer - Sakshi

వలస జీవులకు క్వారంటైన్‌ కష్టాలు

తొలుత విమాన చార్జీల మోత.. 

ఆపై హోటల్‌ బిల్లుల వాత

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కోరల్లో చిక్కి బతుకుజీవుడా అంటూ స్వదేశానికి తిరుగుముఖం పట్టి న ప్రవాసీలను హోం క్వారంటైన్‌ ఆర్థికంగా మ రింత చితికిపోయేలా చే స్తోంది. వందేభారత్‌ మి షన్‌లో భాగంగా గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారి ని రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 250 విమానాలు, చార్టెడ్‌ ఫ్లైట్‌లను ఏర్పాటు చేయగా, తెలంగాణవాసుల కోసం 40 విమానాలను నడిపారు. అయితే, అత్యధికంగా తరలివచ్చిన కేరళీయుల కోసం అక్కడి ప్రభుత్వం ఉచిత క్వారం టైన్‌ సౌకర్యం కల్పించింది. మన ప్రభుత్వం క్వా రంటైన్‌ కోసం అదనంగా చార్జీలను వసూలు చేసింది. తొలుత ఉచిత క్వారంటైన్‌ అని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పించేందుకు విమాన చార్జీలు సాధారణ చార్జీలకంటే అదనం గా 10–15శాతం ఎక్కువ వసూలు చేశారు. చార్జీలను లెక్కచేయకుండా స్వదేశంలో అడుగుపెట్టిన ప్రవాసీలను క్వారంటైన్‌ కష్టాలు వెంటా డాయి. విమానాలు దిగగానే పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్వారంటైన్‌ ముగిశాకే హోటల్‌ బిల్లు, మెస్‌ బిల్లు చెల్లించిన తర్వాతే వాటిని తిరిగి అప్పగిస్తున్నారు. దీంతో వలసజీవులు లబోదిబోమంటున్నారు.

90 శాతం మంది కార్మికులే..
గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న తెలంగాణ వాసులలో 90 శాతం మంది కార్మికులే ఉంటున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం ఉంటుంది. ఒక్కో కార్మికునికి కొన్ని కంపెనీలు నెలల తరబడి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అటు వేతనాలు లేక ఇటు ఇంటికి రావడానికి అప్పుచేసి టికెట్‌ కొనుగోలు చేస్తే, వా రు క్వారంటైన్‌ చార్జీలను అదనంగా మోయాల్సి వస్తోంది. క్వారంటైన్‌ కోసం తమను హైదరాబాద్‌ పరిసరాల్లోని హోటళ్లలో ఉంచే బదులు ఇంటికి పంపిస్తే తూ.చ.తప్పకుండా క్వారంటైన్‌ నిబంధనలను పాటిస్తామని వలస కార్మికులు చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉచితంగా వసతి ఏర్పాటు చేసినా భోజనానికి మాత్రం చార్జీలు వసూలు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top