పోలీసులు మనో ధైర్యం కోల్పోవద్దు

Home Minister Mahmood Ali Said The Police Should Not Lose Morale - Sakshi

హోం మంత్రి మహమూద్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌లో ఉన్న పోలీస్‌ అధికారులు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ధైర్యాన్ని కోల్పోకుండా అధికారులు విధులు నిర్వర్తించారని తెలిపారు. ఇప్పుడు చిన్న స్థాయి అధికారి నుండి పెద్దస్థాయి అధికారి వరకు కరోనా బారిన పడుతున్నారని, ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. (డేంజర్‌ బెల్స్‌ !)

తెలంగాణ పోలీస్ అకాడమీలో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని భయాందోళనలకు గురికావొద్దని అభ్యర్థులకు ఆయన సూచించారు. కరోనా బారిన పడిన పోలీసులు తిరిగి కోలుకుని విధుల్లోకి చేరారని, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. లాక్‌డౌన్‌ నుంచి నేటి వరకు విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఎప్పుడు ముందున్నారని మహమూద్‌ అలీ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top