కూల్చివేతల బులిటెన్ విడుదల చేయొచ్చుగా..

High Court Questions TS Government About Media Allowed In Demolition of Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేతలను కవరేజ్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. కూల్చివేతల వద్దకు ఎవ్వరిని అనుమతించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ 180ఇ ప్రకారం సైట్‌లో పని చేసే వారు మాత్రమే ఉండాలి.. కానీ మిగిలిన వారు ఉండటానికి అనుమతి లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కూల్చివేతల అంశంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. (కేబినెట్‌ ఆమోద ప్రతిని ఇవ్వండి)

కోవిడ్ బులిటెన్‌లను ఏవిధంగా విడుదల చేస్తున్నారో కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ కూడా అలానే విడుదల చేయొచ్చు కదా అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే 95 శాతం కూల్చివేత పనులు పూర్తి  అయ్యాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ అంశం గురించి ప్రభుత్వాన్ని సంప్రదించి సోమవారం చెప్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం వరకు గడువు ఇవ్వలేమన్న హైకోర్టు.. రేపటిలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top