స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసులు | high court notice to Telangana legislative council chairman swamygoud on tdlp merge | Sakshi
Sakshi News home page

స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసులు

Apr 20 2015 2:05 PM | Updated on Aug 31 2018 9:15 PM

స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసులు - Sakshi

స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది.

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

మార్చి 9న టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండీ సలీంను గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement