తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్‌! | High Court Issues Notices To Telangana Assembly Secretary | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్‌!

Jun 15 2018 4:12 PM | Updated on Apr 7 2019 3:47 PM

High Court Issues Notices To Telangana Assembly Secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌ కుమార్‌లు దాఖలుచేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement