కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలొద్దు: హైకోర్టు 

High Court comments about religious activities in court premises - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాల ప్రాంగణాల్లో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలని ఇరు రాష్ట్రాల జిల్లా జడ్జీలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. కొందరు న్యాయవాదులు అనుమతులు తీసుకోకుండానే కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సర్క్యులర్‌ జారీ చేశామని హైకోర్టు పేర్కొంది. సర్క్యులర్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top