బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సినీ నటుడు ఆర్యన్ రాజేష్ సోమవారం దర్శించుకున్నారు.
బాసరలో సినీ హీరో సందడి
Jun 5 2017 1:21 PM | Updated on Sep 5 2017 12:53 PM
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సినీ నటుడు ఆర్యన్ రాజేష్ సోమవారం దర్శించుకున్నారు. తన కూతురు అక్షర శ్రీకారం కోసం ఆలయానికి విచ్చేసిన ఆర్యన్ రాజేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు భక్తులతో కలిసి సాధారణ భక్తులతో పాటే క్యూలైన్లో నిల్చొని అమ్మవారిని దర్శించుకోవడం గమనార్హం. ఏకాదశి శుభ ముహుర్తం కావడంతో అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షర శ్రీకారల కోసం వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
Advertisement
Advertisement