ధారూర్‌లో భారీ వర్షం | Heavy Rain in Dharur mandal in RR Dist | Sakshi
Sakshi News home page

ధారూర్‌లో భారీ వర్షం

Jun 22 2016 10:02 AM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది.

ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement