వైద్య విధాన పరిషత్‌ డాక్టర్లకు షాక్‌ 

Health And Medical Department Gave Shock To Doctors - Sakshi

వైద్య విద్య అధ్యాపకుల పోస్టుల్లో మొండిచేయి

అన్యాయంపై మంత్రి ఈటలకు వైద్యుల విన్నపం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న స్పెష లిస్టు వైద్యులకు వైద్యఆరోగ్య శాఖ షాక్‌ ఇచ్చింది. వైద్య విద్య అధ్యాపకుల పోస్టులకు సంబం ధించి అసిస్టెంట్‌ పోస్టుల నియామకాల్లో టీవీవీ పీ డాక్టర్లకు మొండిచేయి చూపింది. ఇన్‌ సర్వీస్‌ కోటా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో నిబంధనల ప్రకారం టీవీవీపీ స్పెషలిస్టు డాక్టర్లకు అవకాశమివ్వాలి. కానీ వైద్య విద్య అధ్యాపకుల నియామ కాల్లో వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దాంతో తెలంగాణ వైద్యుల సంఘం నేతలు డాక్టర్‌ లాలూ ప్రసాద్, డాక్టర్‌ ప్రవీణ్, డాక్టర్‌ నరహరి ఆధ్వర్యంలో డాక్టర్లు సోమ వారం మంత్రి ఈటల రాజేందర్‌ను సచివాల యంలో కలిశారు. తమకు జరిగిన అన్యాయా న్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఇన్‌ సర్వీస్‌ కోటా భర్తీపై జీవో నెంబరు 154లో వైద్య విద్య కళాశాలల్లో పనిజేస్తున్న ట్యూటర్లు, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, టీవీవీపీలో పీజీ అర్హత ఉన్న వారంతా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అర్హులు. ఆ మేర కు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో టీవీవీపీ లో 120 మంది డాక్టర్లు, ప్రజారోగ్య సంచాల కుల పరిధిలో 220 మంది వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి అసిస్టెం ట్‌ ప్రొఫెసర్‌గా పోస్టింగ్‌ ఖాయమని టీవీవీపీ వైద్యులు భావించారు. కానీ డీహెచ్‌ పరిధిలో ఉన్నవారికే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా అవకాశమివ్వాలని వైద్యారోగ్యశాఖ సర్క్యులర్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని వైద్య విద్యా సంచాలకులు దృష్టి కి తీసుకొచ్చారు. ఉపయోగం లేకపోవడంతో ఈటలను కలిశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top