అల్లుడి చేతిలో మామ హత్య | he was murdered by his father-in-law | Sakshi
Sakshi News home page

అల్లుడి చేతిలో మామ హత్య

Jul 10 2014 2:12 AM | Updated on Sep 2 2017 10:03 AM

అల్లుడి చేతిలో మామ హత్య

అల్లుడి చేతిలో మామ హత్య

గోదావరిఖనిలో అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటనపై ఏఎస్పీ పకీరప్ప బుధవారం విచారణ చేపట్టారు.

హత్యపై ఏఎస్పీ విచారణ..

కోల్‌సిటీ : గోదావరిఖనిలో అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటనపై ఏఎస్పీ పకీరప్ప బుధవారం విచారణ చేపట్టారు. వివరాలు వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌కు చెందిన వేమ అంకూస్(50) ఆర్జీ-1లోని 11ఏ గనిలో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. అంకూస్‌కు భార్య సరోజన, నలుగురు కూతుళ్లు. రెండో కూతురు సుమలతను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని సీసీసీకి చెందిన నరెడ్ల సతీశ్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. సతీశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తొలి ఏకాదశి పండుగకు రెండో కూతరు, అల్లుడు అంకూస్ ఇం టికొచ్చారు.  
 
అయితే సతీశ్ కొద్ది రోజులుగా ఆటో నడపకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ విషయమై మా మ, అల్లుడిని మంగళవారం రాత్రి నిలదీశాడు. కోపోద్రిక్తుడైన సతీశ్ మామపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన అత్త, భార్య, మరదలును గదిలో బంధించి.. మామ తలపై ఇటుకలతో దాడి చేయడంతో అంకూస్ అక్కడిక్కడే ప్రాణాలొది లాడు. నిందితుడి ని ఎస్సై మురళీ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదుతో సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి సీఐ నారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement