సీఎం కేసీఆర్తో హరీష్ రావు భేటీ | Harish rao meeting with cm kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్తో హరీష్ రావు భేటీ

May 12 2015 11:30 AM | Updated on Aug 15 2018 9:27 PM

సీఎం కేసీఆర్తో హరీష్ రావు భేటీ - Sakshi

సీఎం కేసీఆర్తో హరీష్ రావు భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్తో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్తో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెపై చర్చించారు. అదికాక ఆర్టీసీ సమ్మెకు తన మద్దతు ఉంటుందని ఇటీవల హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా భేటీలో చర్చకు వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి ఏడో రోజుకు చేరుకుంది.

అయితే ఆర్టీసీ కార్మికలు తెలంగాణ మంత్రి వర్గ ఉప సంఘంతో సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ రోజు కూడా కార్మికులు... మంత్రి వర్గ ఉప సంఘంతో భేటీ కానున్నారు. చర్చలు తుది దశకు చేరుకుంటాయని అంతా భావిస్తున్నారు. కాగా తమకు హరీష్ రావు మద్దతు ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యలు చేసిన  నేపథ్యంలో కేసీఆర్... హరీష్ రావు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement