ఘనంగా హరీశ్‌ జన్మదిన వేడుకలు

Harish Rao birthday Celebrations as Grand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, అభిమానులు పోటెత్తడంతో మంత్రుల నివాస సముదాయం జనసందోహంగా మారింది.ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, చందూలాల్, ఎంపీలు, తదితరులు ఎమ్మెల్యేలు తీగల, గాంధీ, మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌ తన తల్లి లక్ష్మి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.  కాగా, అత్యంత క్రియాశీలకంగా పనిచేసే మన మంత్రుల్లో హరీశ్‌ ఒకరంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

సిద్దిపేటలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ 
సిద్దిపేట జోన్‌: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే సిద్దిపేటలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మలేసియాకు చెందిన ప్రముఖ సంస్థ డీఎక్స్‌ఎన్‌ సిద్దిపేటలో మొదటి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి హరీశ్‌తో మలేసియా ప్రతినిధి డాక్టర్‌ లిమ్‌సీయోజిన్‌ భేటీ అయ్యారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top