రుణమాఫీపై రాద్దాంతం తగదు | happy for kcr as cm | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై రాద్దాంతం తగదు

Jun 7 2014 4:46 AM | Updated on Aug 15 2018 9:20 PM

రుణమాఫీపై  రాద్దాంతం తగదు - Sakshi

రుణమాఫీపై రాద్దాంతం తగదు

పంట రుణాలమాఫీ అంశాన్ని ఇప్పుడే రాద్దాంతం చేయటం సరికాదని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్ సీఎం కావడం సంతోషకరం: జగ్గారెడ్డి

సంగారెడ్డి, న్యూస్‌లైన్: పంట రుణాలమాఫీ అంశాన్ని ఇప్పుడే రాద్దాంతం చేయటం సరికాదని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే తాను స్పందిస్తానని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మెదక్ జిల్లాకు చెందిన కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన చొరవ చూపాలని కోరారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోను విశ్వసించి జిల్లా ప్రజలు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించినట్లు ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement