
సాక్షి, నల్గొండ: కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధి వైపే ఉంటారని తెలిపారు. మరోసారి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చని గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇకపోతే 2019లో ‘దిశ’లాంటి కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.