వాటర్‌గ్రిడ్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం | Governor grants water Water grid ordinance | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

Feb 21 2015 2:42 AM | Updated on Sep 2 2017 9:38 PM

తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ శుక్రవారం ఆమోదం తెలిపారు.

రెండ్రోజుల్లో నోటిఫికేషన్ తేనున్న సర్కార్
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ  వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా.. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని భావించింది. వాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లభించాకే ఆర్డినెన్స్ ఫైలును గవర్నర్‌కు పంపాలి. అయితే సర్క్యులేషన్ పద్ధతిన మంత్రులందరి ఆమోదం తీసుకొని ఆఘమేగాల మీద ఆర్డినెన్స్ ఫైలును గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. తాజాగా గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement