సర్కారు బడికెళితే రూ.లక్ష నజరానా | government schools in medak district | Sakshi
Sakshi News home page

సర్కారు బడికెళితే రూ.లక్ష నజరానా

Jun 9 2016 7:55 PM | Updated on Oct 16 2018 3:12 PM

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నాం.. మీ పిల్లలందరినీ సర్కారు పాఠశాలలకు పంపించండి..

రేగోడ్ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నాం.. మీ పిల్లలందరినీ సర్కారు పాఠశాలలకు పంపించండి.. వందశాతం ప్రభుత్వ బడికి పంపితే ఆ గ్రామ పంచాయతీకి రూ. లక్ష బహుమానం ఇస్తామని  మెదక్ జిల్లా జోగిపేట డిప్యూటీ డీఈఓ పోమ్యానాయక్ ప్రకటించారు. మండల కేంద్రమైన రేగోడ్‌లోని ఎంఆర్‌సీ కార్యాలయాన్ని పోమ్యానాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమం తీరుతెన్నులపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా సీఆర్‌పీలకు పలు సూచనలు చేశారు. రూ. లక్ష నజరానాపై విస్తృతంగా గ్రామంలో ప్రచారం చేయాలని కోరారు. గ్రామంలోని బడిబయటి పిల్లలను బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 13న సామూహిక అక్షరభ్యాసం నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement