పరిగి అభివృద్ధికి నిధులివ్వండి  | Give Funding To Parigi Development | Sakshi
Sakshi News home page

పరిగి అభివృద్ధికి నిధులివ్వండి 

Jul 19 2018 9:05 AM | Updated on Jul 19 2018 9:05 AM

Give Funding To Parigi Development - Sakshi

మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతున్న హరీశ్వర్‌రెడ్డి  

పరిగి వికారాబాద్‌ : నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు , మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈమేరకు బుధవారం ఆయన ఐటీశాఖ మంత్రిని హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి పలు అంశాలు చర్చించారు.

పరిగి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోని పలు సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, నిధుల కేటాయింపుకు హామీ ఇచ్చారని హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement