‘బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలి’ | Give 50percent Tickets to BCs says Krishnaiah | Sakshi
Sakshi News home page

‘బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలి’

Mar 16 2019 3:25 AM | Updated on Mar 16 2019 3:25 AM

Give 50percent Tickets to BCs says Krishnaiah - Sakshi

హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలోని బీసీలకు 50% టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. విద్యానగర్‌లోని బీసీభవన్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీసీ నాయకుల కోర్‌ కమిటీ సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్‌ చేశారు. గతంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో బీసీలకు బిచ్చమేసినట్లు టీడీపీ అతితక్కువ ప్రాతినిథ్యం కల్పించిందని విమర్శించారు. పార్టీలు బీసీల ను ఓటు బ్యాంక్‌ గానే చూస్తున్నాయన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement