కుటుంబ సభ్యులను ఇంట్లో ఉండగా బయటి నుంచి గడియ పెట్టి ఓ బాలిక అదృశ్యమైన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
డబీర్‌పురా(హైదరాబాద్): కుటుంబ సభ్యులను ఇంట్లో ఉండగా బయటి నుంచి గడియ పెట్టి ఓ బాలిక అదృశ్యమైన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్సై కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం... నూర్‌ఖాన్‌బజార్ బాల్‌శెట్టికేత్ ప్రాంతానికి చెందిన సయ్యద్ జహంగీర్, ఆరీఫా బేగంల కూతురు నూర్జహాన్ (16) ఇంటర్ చదువుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు బ్రష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండటం గమనించిన ఆమె... బయటి నుంచి తలుపు గడియ పెట్టి కనిపించకుండా వెళ్లిపోయింది.
అనంతరం కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో గడియ తీయించి వాకబు చేయగా సమాచారం తెలియలేదు. దీంతో పాఠశాల, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఆరా తీశారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో బుధవారం సాయంత్రం డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.