లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు | Gender verification tests take actions | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

Jun 21 2014 5:42 AM | Updated on Sep 15 2018 3:43 PM

స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ఆమోస్ అన్నారు.

డీఎంహెచ్‌ఓ ఆమోస్
మిర్యాలగూడ క్రైం : స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ఆమోస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ భవనంలో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు, గైనకాలజీ డాక్టర్లకు గర్భస్త పిండ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్త పిండానికి సంబంధించిన వ్యా ధులను కనుగొనడానికి మాత్రమే స్కానింగ్ నిర్వహించాలన్నారు.

ఎట్టిపరిస్థితుల్లో ఆడ, మగ అని వివరాలు తెలపకూడదని అన్నారు. స్కానింగ్ సెంటర్లలో నిర్వహించే పరీక్షల వివరాలను ప్రతి నెల క్లస్టర్ కార్యాలయంలో అం దించాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీ క్షలు చేసి అబార్శన్లు నిర్వహించినట్లు తెలిస్తే సంబంధిత డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. సమాజంలో రోజురోజుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడపిల్ల అనే వివక్షను ప్రతి ఒక్కరూ విడనాడాలని సూచించారు.  సమావేశంలో మాస్ మీడియా అధికారి తిరుపత య్య, లీగల్ అడ్వయిజర్ వెంకట్‌రెడ్డి, ఎస్‌పీహెచ్‌ఓ కృష్ణకుమారి, ఐఎంఏ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, డాక్టర్లు జ్యోతి, పారిజాత, శ్వేతారెడ్డి, క్లస్లర్ అధికారులు శ్రీనివాసస్వామి, శ్రీనివాసరావు, భగవాన్‌నాయక్, తిరుపతయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement