‘గే’లి చేస్తే.. గల్లా పడతాం..

Gay Social Networking App For Transgender - Sakshi

సాక్షి, సిటీబ్యూరో  :‘గే’లి చేస్తే.. గల్లా పడతాం.. అంటోంది బ్లూడ్‌ అనే గే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌. ఇంటా, బయటా, సోషల్‌ మీడియాలో స్వలింగ సంపర్కలను అవహేళన చేస్తూ, అసభ్యంగా, అశ్లీల కామెంట్లు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తోంది. కొంతకాలంగా స్వలింగ సంపర్కులకు చెందిన ఎల్‌జిటిబిక్యు కమ్యూనిటీకి మద్దతుగా పనిచేస్తోంది. తాజాగా సిటీలోని సదరు కమ్యూనిటీ సభ్యులకు శుభవార్త చెప్పింది. స్వలింగ సంపర్కుల హక్కులపై అందరిలో అవగాహన కల్పించేందుకు యాంటి సైబర్‌ బుల్లీయింగ్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ కంట్రీ మేనేజర్‌ యుజున్‌ తెలిపారు. దీని కోసం తమ సంస్థ క్వీరిథిమ్, యా డాట్‌ ఆల్‌ సంస్థలతో చేతులు కలిపిందని వివరించారు. దీనిలో భాగంగా పలు వీడియోల ఆధారంగా స్వలింగ సంపర్కులపై వేధింపులు, వారి వ్యథలు కూడా చూపించడం కూడా జరుగుతుందన్నారు. అంతేగాకుండా దీంతో పాటు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ వాటి కార్యకలాపాలపై కూడా అవగాహన పెంచుతామన్నారు. దీనిపై అదనపు సమాచారం కోసం తమ హెల్ప్‌లైన్‌ నంబర్లు 97.4554.5559, 60.0903.2883లో సంప్రదించాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top