Sakshi News home page

అకాల వర్షం.. అతలాకుతలం

Published Mon, Apr 14 2014 1:46 AM

భువనగిరి : నేలవాలిన వరి చేను, (ఇన్‌సెట్‌లో) రాలిన వడ్లు ,హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు, కారుపై విరిగి పడిన కొబ్

భువనగిరిటౌన్, న్యూస్‌లైన్,భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆది వారం కురిసిన అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. భారీ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణలో నీరు చేరడంతో ప్ర యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 పట్టణంలోని ఎంఎన్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో పార్కింగ్ చేసిన కారుపై కొబ్బరి చెట్టు కూలిపడడంతో పూర్తిగా ధ్వంసమైంది. అలాగే వడగండ్ల వానకు వరి నేలవాలింది. సుమారు 400 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

 గంజ్ మార్కెట్ యార్డులో 100 బస్తాల ధాన్యం తడిసిపోయింది. మండల పరిధిలోని తుక్కాపురం, అనాజీపురం, పెంచికల్‌పహాడ్, రామచంద్రాపురం, రామకిష్టాపురం, రాయగిరి, బస్వాపురం, కూనూరు, ముత్తిరెడ్డిగూడెం, బీఎన్ తిమ్మాపురం గ్రామాల్లో వరితో పాటు మామిడికి నష్టం వాటినట్లు అధికారులు పేర్కొన్నారు.

 గ్రామాల్లో అంధకారం
 పోచంపల్లి : ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పోచ ంపల్లి మండలం పెద్దరావులపల్లిలో కరెంట్ తీగలు తెగిపోయాయి. పలు గ్రామాల్లో స్తంభాలు నేలకూలడంతో అంధకా రం నెలకొంది. కప్రాయిపల్లి, జూలూరు, పోచంపల్లి, జలాల్‌పురం గ్రామాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.

Advertisement

What’s your opinion

Advertisement