‘టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలే ఓనర్లు’

Gangula Kamalakar Said People Is The Owner For TRS Party - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : అన్ని పార్టీలు ఏకమై వచ్చినా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపును ఆపలేకపోయారని పౌర సరఫరా, సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు. రామడుగు మండలం గోపాల్‌రావు పేట మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణకు మంత్రి హాజరైయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ కారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుందని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కేసీఆర్‌ది కాదని.. తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓనర్‌ ఎవరూ లేరని.. ప్రజలే ఓనర్లని అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top