వైభవంగా గడికోట మైసమ్మ బోనాలు 

Gandikota Maisamma Bonalu Festival Rangareddy - Sakshi

మహేశ్వరం: మండల కేంద్రంలోని గడికోట మైసమ్మ బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. శిగవగంగ రాజరాజేశ్వర ఆలయ బ్రహోత్సవాలకు ముందుగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు వైభవంగా నిర్వహిం చారు. గడికోటలో వెలసిన మైసమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో అభిషేకం, హారతి, కుంకుమార్చన, మంత్రపుష్పం, పుష్పాలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివగంగ రాజరాజేశ్వర ఆలయ చైర్మన్‌ కాకి కుమార్‌ ముదిరాజ్‌ అధ్యక్షతన అమ్మవారికి ప్రత్యేకంగా బోనం తయారు చేయించి శివసత్తులు పూనకాలు, పోతరాజుల నృత్యాలు నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు.

ప్రతి సంవత్సరం శివగంగ రాజరాజేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలకు ముందుగా ఆలయం నుంచి గడికోట మైసమ్మకు బోనం సమర్పించి ఉత్సవాల పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ కమిటీ చైర్మన్‌ కాకి కుమార్‌ ముదిరాజ్‌ తెలిపారు. ఈసారి  శివగంగ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం సర్పంచ్‌ కర్రోళ్ల ప్రియాంక, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు  కర్రోళ్ల చంద్రయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ఏకలవ్య, జోరల రమేష్, వీరుబాబు, నాగేష్, పరమేష్, యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నయీంఖాన్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top