
గెటప్ మార్చిన గద్దర్
సమాజంలో రుగ్మతలను తొలగించే దిశగా తనవంతు కృషి చేస్తున్న ప్రజాయుద్ధనౌక, టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గద్దర్ తన వేషధారణ మార్చారు.
ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ దశాబ్దాలు గడుస్తున్నా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని, ఆ దిశగా ప్రభుత్వాలు సరైన కృషి చేయడంలేదనీ, ప్రజల్లో కూడా మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచే మార్పు జరగాలని భావించి ప్యాంట్, ఇన్‌షర్ట్ వేసుకుని, టై కట్టుకున్నానని, ఇక నుంచి అందరూ మారాలన్నారు.