అమ్మో.. ఆ సీటొద్దు..!

Full Fraud In Tax Department Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్ర వాణిజ్య పన్నుల శా ఖ బోధన్‌ సర్కిల్‌లో పనిచేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు జంకుతున్నారు. ఇక్కడ పోస్టింగ్‌ అంటేనే మాతో కాదంటూ చేతులెత్తేస్తున్నా రు. కీలకమైన అసిస్టెంట్‌ కమిషనర్‌ (సీటీవో) పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటోంది. వాణిజ్య పన్నుల శా ఖలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన విష యం విధితమే. ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ శివరాజ్, రైసుమిల్లర్లు అధికారులతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు పన్ను ఎగవేశారు.

ఈ నేపథ్యంలో తరచూ నివేదికలు పంపడం, విచారణ కోసం రాష్ట్ర కార్యాలయాల సమావేశాలకు హాజరుకావడం వంటివి ఎక్కువగా ఉండటంతో ఇ క్కడ పనిచేసేందుకు ఆశాఖ ఉన్నతాధికా రులెవరూ ముందుకు రావడం లేదు. ఇక్క డ సీటీవోగా పనిచేసిన విజయేందర్‌ ఎని మిది నెలల క్రితం బదిలీ చేసుకుని వెళ్లి పో యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో కూ డా ఈ స్థానానికి ఎవరూ రాలేదు. ఆ సర్కిల్‌లోని డీసీటీవోకు ఇన్‌చార్జి సీటీవోగా బా ధ్యతలు అప్పగించారు. ఆ అధికారి కూడా సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. ప్రస్తు తం నిజామాబాద్‌ సర్కిల్‌లో పనిచేస్తున్న మరో డీసీటీవోకు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు.

ఎగవేసిన పన్ను వసూలు పడకేసింది
వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన పన్ను ఎగవేత కుంభకోణం రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన విషయం విధిత మే. నకిలీ చలానాలు, బోగస్‌ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ పేరుతో రైసుమిల్లర్లు సర్కారు ఖ జానాకు రూ.కోట్లలో ఎగనామం పెట్టారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆశాఖ  జిల్లా వ్యాప్తంగా 118 మంది మిల్లర్లు రూ.62 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. కేసు విచార ణ దాదాపు అటకెక్కగా, ఎగవేసిన సొమ్ము రికవరీ కూడా పడకేసింది. మిల్లర్లకు రాజకీయ అండదండలుండటంతో పన్ను బకాయిలను చెల్లించకుండా యథేచ్ఛగా తమ దందాలు కొనసాగిస్తున్నారు.

వాణిజ్య ప న్నుల శాఖ అధికారులు కూడా ఈ బకా యిల వసూళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాథమికంగా తేల్చినట్లుగా ఎగవేసిన సొమ్ము రూ.62 కోట్లలో కనీసం 50 శాతం కూడా ఇప్పటి వసూలు కాకపోవడం గమనార్హం. కుంభకోణం వెలుగు చూసిన కొత్తలో నామమాత్రంగా బకాయి లు చెల్లించిన మిల్లర్లు ఆపై దాదాపు చేతులెత్తేశారు. కొందరు మిల్లర్లు ఇచ్చిన చె క్కులు కూడా బౌన్స్‌ అయ్యాయి. ఈ నే పథ్యంలో ఈ సర్కిల్‌లో పనిచేసేందుకు అ ధికారులు ముందుకు రాకపోవడంతో ప న్ను ఎగవేతదారులకు మరింత వెసులు బాటు దొరికినట్లవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top