breaking news
Fake cases
-
దెబ్బ తిన్న వాళ్లు రేపు నా మాట కూడా వినరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్‌ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు. -
Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్
-
తప్పుడు వార్తలను ప్రచురించే మీడియా సంగతేంటి..?
-
పచ్చ కుట్రలు పటాపంచలు
-
అమ్మో.. ఆ సీటొద్దు..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శా ఖ బోధన్ సర్కిల్లో పనిచేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు జంకుతున్నారు. ఇక్కడ పోస్టింగ్ అంటేనే మాతో కాదంటూ చేతులెత్తేస్తున్నా రు. కీలకమైన అసిస్టెంట్ కమిషనర్ (సీటీవో) పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటోంది. వాణిజ్య పన్నుల శా ఖలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన విష యం విధితమే. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, రైసుమిల్లర్లు అధికారులతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు పన్ను ఎగవేశారు. ఈ నేపథ్యంలో తరచూ నివేదికలు పంపడం, విచారణ కోసం రాష్ట్ర కార్యాలయాల సమావేశాలకు హాజరుకావడం వంటివి ఎక్కువగా ఉండటంతో ఇ క్కడ పనిచేసేందుకు ఆశాఖ ఉన్నతాధికా రులెవరూ ముందుకు రావడం లేదు. ఇక్క డ సీటీవోగా పనిచేసిన విజయేందర్ ఎని మిది నెలల క్రితం బదిలీ చేసుకుని వెళ్లి పో యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో కూ డా ఈ స్థానానికి ఎవరూ రాలేదు. ఆ సర్కిల్లోని డీసీటీవోకు ఇన్చార్జి సీటీవోగా బా ధ్యతలు అప్పగించారు. ఆ అధికారి కూడా సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. ప్రస్తు తం నిజామాబాద్ సర్కిల్లో పనిచేస్తున్న మరో డీసీటీవోకు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఎగవేసిన పన్ను వసూలు పడకేసింది వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన పన్ను ఎగవేత కుంభకోణం రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన విషయం విధిత మే. నకిలీ చలానాలు, బోగస్ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో రైసుమిల్లర్లు సర్కారు ఖ జానాకు రూ.కోట్లలో ఎగనామం పెట్టారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆశాఖ జిల్లా వ్యాప్తంగా 118 మంది మిల్లర్లు రూ.62 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. కేసు విచార ణ దాదాపు అటకెక్కగా, ఎగవేసిన సొమ్ము రికవరీ కూడా పడకేసింది. మిల్లర్లకు రాజకీయ అండదండలుండటంతో పన్ను బకాయిలను చెల్లించకుండా యథేచ్ఛగా తమ దందాలు కొనసాగిస్తున్నారు. వాణిజ్య ప న్నుల శాఖ అధికారులు కూడా ఈ బకా యిల వసూళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాథమికంగా తేల్చినట్లుగా ఎగవేసిన సొమ్ము రూ.62 కోట్లలో కనీసం 50 శాతం కూడా ఇప్పటి వసూలు కాకపోవడం గమనార్హం. కుంభకోణం వెలుగు చూసిన కొత్తలో నామమాత్రంగా బకాయి లు చెల్లించిన మిల్లర్లు ఆపై దాదాపు చేతులెత్తేశారు. కొందరు మిల్లర్లు ఇచ్చిన చె క్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఈ నే పథ్యంలో ఈ సర్కిల్లో పనిచేసేందుకు అ ధికారులు ముందుకు రాకపోవడంతో ప న్ను ఎగవేతదారులకు మరింత వెసులు బాటు దొరికినట్లవుతోంది. -
ప్రశ్నిస్తే పోలీసు కేసులే
నెల్లూరు, పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లినా, మంత్రి సోమిరెడ్డిపై ఎదురు తిరిగి ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారనే వాదన బలంగా ఉంది. ఇందుకు పోలీసు అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. పార్టీలు మారే హక్కు ఎవరికైనా ఉంటుంది. సిద్ధాంతాలు, పద్ధతులు నచ్చని నాయకులను హద్దులు మీరకుండా విమర్శలు చేయడం ఎక్కడైనా జరుగుతున్న వ్యవహారమే. అయితే మంత్రి సోమిరెడ్డి ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినా, విమర్శించినా అదును చూసి పోలీసు కేసులు పెట్టిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ గ్రామ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ వర్గాలను పెంచిపోషిస్తున్నట్టు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పొదలకూరు మండలం వైఎస్సార్ సీపీకి కంచుకోట కావడంతో ఇక్కడ మంత్రి తన హవాను కొనసాగించేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవకాశం దొరికితే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసు కేసులు బనాయిస్తున్నారనే అపవాదు మంత్రిపై ఉంది. గ్రామాల్లో సర్దుకుపోయే వ్యవహారాలను సైతం పోలీసు స్టేషన్ వరకు తీసుకు వెళ్లి గ్రామాల్లో రాజకీయాలను రావణకాష్టంలా తయారు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చట్టాల దుర్వినియోగం ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా, కార్యకర్త అయినా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కేసులను ఎదుర్కోవాలంటే చట్టానికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చట్టాలను పరిరక్షించాల్సిన మంత్రే వాటిని దుర్వినియోగం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ కల్యాణపురం, ముత్యాలపేటలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు అక్కెం బుజ్జిరెడ్డి, చేవూరు వెంకటకృష్ణయ్య బిరదవోలు గిరిజనకాలనీకి చెందిన శెనగల చెంచయ్యను కులంపేరుతో దూషించి, వెట్టిచాకిరి చేయించినట్టు వారిపై గతనెల 13న ఫిర్యాదు అందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందులో స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో మంత్రే ఇద్దరిపై కేసును పెట్టించారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో చెంచయ్య రాజకీయ బలిపశువుగా మారి వాస్తవాలను గ్రహించి ఈనెల 9న నేరుగా హైకోర్టు జడ్జి వద్దకు వెళ్లి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అంతేకాక తనను బుజ్జిరెడ్డి, వెంకటకృష్ణయ్య తిట్టలేదని, వేధించలేదని వాగ్మూలం ఇచ్చాడు. దీంతో జడ్జి బుజ్జిరెడ్డి, వెంకటకృష్ణయ్యలపై పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిణామాలతో అధికార పార్టీ నాయకులు మంత్రి ప్రోద్బలంతో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీల సంఘాల నాయకులు సైతం ఇలాంటి ఘటనలను ఖండిస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు ఆజ్యం సాధారణంగా రాజకీయ నాయకులు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలను ఆకట్టుకుంటారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ కక్షలను ప్రోత్సహించి ఆజ్యం పోసి వర్గాలను ఏర్పాటు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇందుకు మంత్రి సోమిరెడ్డి కృషి చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసును ఎదుర్కొన్న కల్యాణపురం, ముత్యాలపేట గ్రామస్తులు ఇదేవిషయాన్ని విలేకర్ల సమక్షంలో వెల్లడించారు. అక్కెం బుజ్జిరెడ్డి మంత్రి వద్ద పాతికేళ్లకు పైగా ఉన్నారు. ఆయన అండదండలతో బిరదవోలు పంచాయతీలో రావుల అంకయ్యగౌడ్‌ను కూడా ఎదుర్కొని కేసు మోసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బుజ్జిరెడ్డిని మంత్రి ఒక సందర్భంలో దుర్భాషలాడడంతో తీవ్రంగా మనస్తాపం చెంది వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం బుజ్జిరెడ్డి తనకు మంత్రి చేసిన అన్యాయాన్ని సభల్లో వెల్లడిస్తూ వచ్చారు. ఫలితంగానే బుజ్జిరెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవాల్సి వచ్చిందని పంచాయతీ ప్రజలు వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గ్రామాల్లో చాలానే ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్లు సైతం అవమానాలు ఎదుర్కొంటున్నారని, సమయం చూసి దెబ్బకొడతామని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతున్నందున ఈ ఘటనలు ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదని, అక్రమ కేసులు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటాం: కాకాని
నెల్లూరు: వైఎస్ఆర్సీపీ నేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థి జేఏసీతో కలిసి పనిచేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. -
టీడీపీ దౌర్జన్యంతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య
పశ్చిమ గోదావరి: అధికార తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార టీడీపీకి చెందిన సర్పంచ్‌ను ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తపై అక్రమ కేసు బనాయించారు. దీంతో మనస్తాపం చెందిన సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిప్పుంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. వీరవాసరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంటసాల నాగరాజు(28)కు సర్పంచ్‌కు పంచాయతీ పైప్‌లైన్ నిర్మాణం విషయంలో వాగ్వివాదం జరిగింది. దీంతో సర్పంచ్, తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు నాగరాజుపై ఎప్రిల్ 14 కేసు నమోదు చేసి స్టేషన్లో రోజంతా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు అదే రోజు స్టేషన్ ఆవరణలో పెట్రోలు పోసుకుని నిప్పుంటించుకున్నాడు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.టీడీపీ అక్రమ కేసులు బనాయింపును నిరసిస్తూ మృతుడి బందువులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. -
'అక్రమ కేసులు పెడితే సహించం'
రంపచోడవరం: వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేదిలేదని పార్టీ నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. బుధవారం రంపచోడవరంలో జరిగిన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు పట్టిసీమ ప్యాకేజీని అమలు చేయాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. అధికారులు వేధింపులు మానుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని అన్నారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మానవతాదృక్పధంతో వ్యవహరించాలని కోరారు. -
తప్పుడు కేసులెన్ని పెట్టినా బెదరను: భూమా
నంద్యాల: పోలీసులపై తెలుగుదేశ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు మాత్రం స్వచ్ఛందంగా కేసు నమోదు చేశామని కొత్త వాదన వినిపిస్తున్నారని భూమా అన్నారు. తనను, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసులు బనాయించారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా.. నేను బెదరను అని నాగిరెడ్డి అన్నారు. ప్రజలు, అభివృద్ధి కోసం ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా..ధైర్యంగా ఎదుర్కొంటానని భూమా నాగిరెడ్డి అన్నారు.