బీపీవో ఉద్యోగాలకు ఓయూలో ఉచిత శిక్షణ | free coaching in osmania university for bpo jobs | Sakshi
Sakshi News home page

బీపీవో ఉద్యోగాలకు ఓయూలో ఉచిత శిక్షణ

Mar 14 2015 4:59 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ, లిట్రసీ హౌస్‌లో బీపీవో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు హౌస్ కార్యదర్శి బి. నాగలక్ష్మి తెలిపారు.

హైదరాబాద్ : నిరుద్యోగ అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ, లిటరసీ హౌస్‌లో బీపీవో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు హౌస్ కార్యదర్శి బి. నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులకు బీపీవో వాయిస్, నాన్ వాయిస్ కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ను అందజేస్తామని చెప్పారు. పూర్తి వివరాలు 93978 24542 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement