నలుగురు రైతుల బలవన్మరణం | Four farmers died | Sakshi
Sakshi News home page

నలుగురు రైతుల బలవన్మరణం

Nov 17 2014 3:25 AM | Updated on Oct 1 2018 2:03 PM

అప్పుల బాధ రైతన్నను బలి తీసుకుంటోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు రైతులు బలవన్మరణం చెందారు.

నెట్‌వర్క్: అప్పుల బాధ రైతన్నను బలి తీసుకుంటోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు రైతులు బలవన్మరణం చెందారు. మెదక్ జిల్లా రామాచంపేట మండలం నగరం గ్రామానికి చెందిన రైతు కొమ్మాట మల్లయ్య(50) రెండెకరాల్లో పెట్టుబడుల కోస రూ. లక్ష అప్పు చేశాడు. సాగునీరు లేక పంట ఎండిపోయింది. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం రాత్రి పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లికి చెందిన రైతు పిట్ల బిక్షపతి(50) పంటల కోసం పెట్టుబడుల కోసం సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు.

అప్పుల తీర్చే మార్గం కనిపించక శనివారం రాత్రి ఇంటి వద్ద ఉరి వేసుకొన్నాడు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం గొల్లపల్లికి చెందిన రైతు మెండె దేవయ్య(60) దిగుబడి రాక, అప్పు పెరిగిపోవడంతో శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన రైతు లస్మన్న  రూ. 40 వేలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేక పొలంలో ఉరి వేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement