
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్‌గా సరైన రీతిలో వ్యవహరించడం తెలుగు వారికి గర్వకారణమని లక్ష్మణ్ అన్నారు. కాగా, తాను మళ్లీ పార్టీలో చేరడం మరపురాని సంఘటన అని విద్యాసాగర్‌రావు అన్నారు.