అటవీశాఖలో ఇంటి దొంగలు..? | Forest Department Thieves in the house ..? | Sakshi
Sakshi News home page

అటవీశాఖలో ఇంటి దొంగలు..?

Dec 4 2014 4:29 AM | Updated on Sep 2 2017 5:34 PM

దుమ్ముగూడెం అటవీ రేంజ్ పరిధి పర్ణశాల సెక్షనలోని ఒక బీట్ అధికారి ఇంట్లో అక్రమంగా 40టేకు దిమ్మలు ఉన్నట్లు సమాచా రం అందుకున్న అటవీ శాఖ ప్రత్యే సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు.

దుమ్ముగూడెం: దుమ్ముగూడెం అటవీ రేంజ్ పరి ధి పర్ణశాల సెక్షనలోని ఒక బీట్ అధికారి ఇంట్లో అక్రమంగా 40టేకు దిమ్మలు ఉన్నట్లు సమాచా రం అందుకున్న అటవీ శాఖ ప్రత్యే సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు.ఆపై ఇంటి దొంగలను కాపాడేందుకు పైఅధికారుల ఒత్తిడి మేరకు యూడీఆర్ కేసును మాత్రమే నమోదు చేసి సిబ్బందిని కాపాడారు .

వివరాలు ...చినబండిరేవులో బీట్ అధికారి ఇంటి  వెనుక 40టేకు దిమ్మలు అక్రమంగా ని ల్వ ఉంచారని భద్రాచలం నార్త్ ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ రాథోడ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన ఆప్రాంతానికి ప్రత్యేక సిబ్బందిని పంపి తనిఖీలు చేయించగా టేకు దిమ్మలతో పాటు ఇంట్లోనే ఫర్నీచర్ చేయించడం వారి కంట పడింది. ఈ కలపను మూడు నెలల క్రితం గ్రామాలలో దాడులు చేసి పట్టుకొచ్చి నిల్వ ఉంచారు. నిల్వచేసిన వారిలో ముగ్గురు సిబ్బంది హస్తం ఉన్నట్లు సమాచారం.

కలపను పట్టుకున్న వెంటనే యూడీఆర్ కేసు నమోదు చేసి దానిపై నంబర్లు నమోదు చేయాలి. కానీ మూడు నెలలు దాటినా కేసు నమోదు చేయకపోగా నంబర్లు సైతం వేయలేదు. దీనికి తోడు ఆ కలపను స్మగ్లర్లకు విక్రయించడానికి మరో సిబ్బంది సుమారు 45 వేలు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కలప నిల్వపై ప్రత్యేక సిబ్బంది దాడిచేసి పట్టుకోవడంతో అధికారులు కూడా తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేసును తారుమారు చేసినట్లు సమాచారం.

మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వ్యవహారం గోప్యంగా ఉంచిన అటవీ సిబ్బంది, అదేరోజు దాడి చేసి దిమ్మలను పట్టుకున్నట్లు, యూడీఆర్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముగ్గురు సిబ్బందితో యూడిఆర్ కేసు నమోదు చేయించిన అధికారులు, కలపను రాత్రికి రాత్రే భద్రాచలం డిపోకు తరలించారు.ఈ విషయంపై భద్రాచలం నార్త్ ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ రాథోడ్‌ను వివరణ కోరగా.. కలప కోసం ప్రత్యేక సిబ్బందిని పంపినమాట వాస్తవమేనన్నారు. కలప ఉన్నమా ట వాస్తవమేనని, కేసు ఎప్పుడు నమోదు చేశారు అనే విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement