
సాక్షి, వాజేడు : వరి పొలంలో చేపల వేట ఏమిటని అనుకుంటున్నారా ! అవునండి నిజమే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరి నీరు ఎగ పోటుతో పొలాల్లోకి చేరింది. వరద పెరిగే సమయంలో గోదావరి నుంచి చేపలు వస్తాయి. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి కాచారం వద్ద పొలాల్లో రైతులు శుక్రవారం తోపెను వలతో చేపలు పట్టుకుంటుండగా ఆ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.